టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా అవసరం పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ప్రస్తుతం యశస్వి జైశ్వాల్ తన ఆట తీరుతో అదరగొడుతున్నారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టుల్లో చెలరేగి ఆడాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 236 బంతులలో జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో 3 మ్యాచుల్లోనే 545 రన్స్ చేసి ఈ సిరీస్లోనే టాప్ స్కోరర్ గా నిలిచారు. ద్వైపాక్షిక టెస్టు సిరీస్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల (1971లో 774) రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. ఈ ఆల్ టైమ్ రికార్డును అధిగమించేందుకు జైస్వాల్ మరో 230 రన్స్ చేయాలి. ఇంగ్లండ్తో ఇంకా 2 టెస్టులు ఉండటంతో అతడు ఈ రికార్డు బద్దలు కొట్టే ఛాన్సుంది.