ఆర్ఆర్ఆర్ కథ చెప్పేసిన జక్కన్న…!

-

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ గురించి చర్చలు ఎన్నో. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. స్వాతంత్ర్య పోరాటం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని అందరూ భావించారు. ఇక ఈ సినిమాలో ఉన్న పాత్రలు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ఇద్దరు కూడా స్వాతంత్ర్య పోరాటం సమయంలో కీలకంగా వ్యవహరించారు.

ఆ ఇద్దరి పేర్లతో సినిమా రావడంతో ఎలా ఉంటుందో…. యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో అని అందరూ ఎదురు చూసారు. కాని జక్కన్న తాజాగా షాక్ ఇచ్చాడు. మీరు అనుకున్నవి ఈ సినిమాలో ఉండే అవకాశం లేదని ఇది కేవలం స్నేహం ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహమే RRR కథ అని ఆయన వివరించాడు. తాజాగా ఒక టీవీ లైవ్ లో ఈ విషయం చెప్పాడు.

ఈ సినిమాలో ఎక్కువగా స్నేహమే ఉంటుందని యాక్షన్ సన్నివేశాలకు అంత ప్రాధాన్యత ఉండదు అని కొన్ని సన్నివేశాలు మాత్రం యాక్షన్ లో కీలకంగా ఉంటాయని ఆయన వివరించాడు. అనుకున్న విధంగానే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేస్తామని స్పష్టం చేసాడు. లాక్ డౌన్ పూర్తి కాగానే సినిమా షూటింగ్ ని మొదలు పెడతామని చెప్పాడు జక్కన్న.

Read more RELATED
Recommended to you

Latest news