జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం లోక్సభ లో జమిలి ఎన్నికల బిల్లు ను ప్రవేశ పెట్టనున్నది. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపనున్నారు. అయితే.. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ కు 293 మంది ఎంపీల మద్దతు ఉన్నది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉన్నది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో పలు మార్పులు చోటుచేసుకొని పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. ప్రస్తుతం మరోసారి కేంద్రం
జమిలి నినాదం ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది.