జమ్మూకశ్మీర్‌లో బోణి కొట్టిన బీజేపీ,నేషనల్ కాన్ఫరెన్స్!

-

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరగగా.. నేడు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బీజేపీ,నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎట్టకేలకు బోణీ కొట్టాయి. ఉదయం నుంచి లీడింగ్‌లో కొనసాగుతున్న అభ్యర్థుల్లో ఒకరైన బసోహ్లిలో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దర్శన్‌కుమార్ తొలి విజయం సాధించారు. ఆయన 16,034 ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. దర్శన్ కుమార్‌కు 31,874 ఓట్లు రాగా.. ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన లాల్ సింగ్ 15, 840 ఓట్లు పోలయ్యాయి. ఇక బీఎస్పీ,పీడీపీ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.

ఇక మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా బోణీ కొట్టింది. గురేజ్‌లో ఎన్సీ అభ్యర్థి నజీర్ విజయం సాధించారు.సమీప ప్రత్యర్థి,బీజేపీ నేత ఫకీర్ మహమ్మద్ కాన్‌పై 1,132 ఓట్ల తేడాతో నజీర్ అహ్మద్‌ఖాన్ గెలుపొందారు.కాగా, ఓట్ల లెక్కింపులో నజీర్ అహ్మద్ ఖాన్‌‌కు 8,378 ఓట్లు రాగా..ఫకీర్ మహమ్మద్ ఖాన్‌కు 7,246 ఓట్లు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version