లెజెండరీ నటి జమున తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అయితే, ఒకానొక సమయంలో జమున తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించొద్దని నిషేధం విధించారట. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
లెజెండరీ యాక్ట్రెస్ జమున సినిమా షూటింగ్స్ అన్నిటికీ రెగ్యులర్ గానే వస్తుంటారు. కాగా, ఒకటి రెండు సార్లు వేరే పనుల వల్ల ఆలస్యంగా వచ్చిందట. అలా వచ్చిన నేపథ్యంలో జమునకు పొగరు అని కొందరు విమర్శలు చేశారట. అలా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో పాటు తెలుగు హీరోల సినిమాల్లో జమునను తీసుకోవద్దని అనుకున్నారట.
తెలుగు చిత్ర సీమలో తనకు అవకాశాలు రాని నేపథ్యంలో జమున హిందీలో సినిమాలు చేసి విజయం అందుకుంది. అలా ఆమె ఇతర భాషల సినిమాల్లో సక్సెస్ లు అందుకుంటోంది. ఈ క్రమంలో నాగిరెడ్డి, చక్రపాణి ఇతర నిర్మాతలు, సినీ ప్రముఖులతో మాట్లాడి వివాదాలన్నీ సద్దుమణిగేలా చేశారు. అలా జమున మళ్లీ తెలుగు సినిమాలు చేసేలా చేశారు.
ఇక ఆ తర్వాత జమున నటించిన ‘గుండమ్మ కథ’, ‘గులేబాకావళి’ తదితర చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. జమున ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. పలు టీవీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు జమున పాల్గొంటుంటారు. జమున మాతృభాష కన్నడ అయినా.. తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ భాషల్లో హిందీ సినిమాలు చేశారు. మొత్తంగా జమున తన కెరీర్ లో 200కు పైగా చిత్రాలు చేశారు.