2024 లో వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ కలిసే పోటీ చేస్తాయని…అందులో ఎలాంటి అనుమానాలు లేవని కుండ బద్దలు కొట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీకి ఒక పాలసీ ఉంది.. తమ పార్టీకి ఒక పాలసీ ఉందని చెప్పారు సోము వీర్రాజు.
బిజెపి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు….అందుకే తాము బద్దేల్ లో పోటీ చేస్తున్నామని ప్రకటన చేశారు. భిన్న అభిప్రాయాలు సాధారణం… జనసేన తో మిత్ర పక్షం గా కొనసాగుతామని వెల్లడించారు.
చనిపోయిన అభ్యర్థి భార్య కి నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చు కదా… పోటిలో నిలపడం దేనికి…? అని వైసీపీకి చురకలు అంటించారు. బద్వేల్ ప్రచారానికి పవన్ ని ఆహ్వానిస్తాం..వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. టీడీపీ జనసేన దగ్గర అవుతుంది అని దానిపై నేను మాట్లాడను …దాని గురించి చర్చ అనవసరమన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు అన్నాడు అందుకే ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.