10 రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తాం – జనసేన నాగబాబు

-

10 రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు జనసేన నాగబాబు. ఇవాళ విశాఖలో జనసేన నాగబాబు మాట్లాడుతూ…వైసిపి విడుదల చేస్తున్న జాబితా పై స్పందించారు. వైసిపి ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని వివరించారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే…పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు.

Janasena candidates will be announced in 10 days

టిడిపి జనసేన కూటమితో బిజెపి కలిసి వస్తుందని భావిస్తున్నామని…మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను మా అధినేత ప్రకటిస్తారని చెప్పారు.టిడిపి జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నేత చింతకాయల విజయ్ తో మర్యాద పూర్వకంగానే కలిశామని వివరించారు. అనకాపల్లి ఎంపి పోటీ అంశం చర్చకు రాలేదు…నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టాన నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు జనసేన నాగబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version