నేడు ఢిల్లీకి జనసేనాని పవన్ కళ్యాణ్ పయనం కానున్నారు. ఈ సందర్భంగా నేడు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై అమిత్‌షా, చంద్రబాబు, పవన్ కలిసి చర్చిస్తారని తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక అటు ప్రస్తుతం ఢిల్లీలోనే చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా 10 రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు జనసేన నాగబాబు. ఇవాళ విశాఖలో జనసేన నాగబాబు మాట్లాడుతూ…వైసిపి విడుదల చేస్తున్న జాబితా పై స్పందించారు. వైసిపి ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని వివరించారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే…పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు. టిడిపి జనసేన కూటమితో బిజెపి కలిసి వస్తుందని భావిస్తున్నామని…మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను మా అధినేత ప్రకటిస్తారని చెప్పారు.