జ‌న‌సేన: ఆవిర్భావ వేడుక‌ల‌కు అంతా సిద్ధం!

-

ప్రశ్నించడం కోసమని చెప్పి పవన్ కల్యాణ్…జనసేన పార్టీ పెట్టి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయి…సరిగ్గా రేపటితో అంటే మార్చి 14వ తేదీతో జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టనుంది…

కరెక్ట్ గా 2014 మార్చి 14న పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు..అయితే ప్రశ్నించడం కోసమని చెప్పి పవన్ పార్టీ పెట్టారు..ఇక పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు అయినా సరే రాజకీయంగా పూర్తిగా సక్సెస్ కాలేకపోయిందనే చెప్పొచ్చు…ఈ సోమవారం జరగబోయే జనసేన ఆవిర్భావ సభ తర్వాత…పవన్ రాజకీయం పూర్తిగా మారుతుందేమో చూడాలి…ఇకనైనా జనసేన పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తారేమో చూడాలి.

పార్టీ పెట్టిన వెంటనే జరిగిన 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా….టీడీపీ-బీజేపీలకు సపోర్ట్ ఇచ్చారు..ఆ పార్టీలు అధికారం లోకి రావడానికి కృషి చేశారు.ఆ విధంగా ఆ రెండు పార్టీలకు సాయం చేసిన పవన్ 2018లో రెండు పార్టీలకు పూర్తిగా దూరం జరిగారు… 2018 జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పి లతో కలిసి పోటీ చేసి కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకున్నారు.

పవన్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు..గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు..అయితే ఎన్నికల తర్వాత జనసేన, బీజేపీతో కలిసి ముందుకెళుతుంది…ఇక రాష్ట్రంలో సమస్యలపై పవన్ ఎప్పటికప్పుడు గళం విప్పుతూనే ఉన్నారు. ఇదే సమయంలో పవన్ తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

మరి నెక్స్ట్ రాజకీయంపై, పొత్తు విషయంపై జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అలాగే జగన్ ప్రభుత్వంపై ఏ విధాగా విరుచుకుపడతారో చూడాలి. అయితే మంగళగిరి వేదికగా జనసేన ఆవిర్భావ సభ వేడుకలని విజయవం తం చేయడానికి జనసైనికులు సిద్ధమయ్యారు..నాయకులు, పార్టీ శ్రేణులు ఫుల్ గా రెడీ అయ్యారు..ఆఖరికి బండ్ల గణేశ్ సైతం ఆవిర్భావ వేడుకల్లో త‌మ గొంతుక వినిపించి అధినేత‌కు మ‌ద్ద‌తుగా ఉండేందుకు సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version