జూబ్లీ హిల్స్ లో జ‌న‌సేన ? హోం మంత్రితో త‌గువేసుకుంటార‌ట !

-

ఇందాక జ‌న‌సేన పెద్ద‌గా తెలంగాణ ప‌రిణామాల‌పై పెద్ద‌గా మాట్లాడింది లేదు. కేసీఆర్-తో ఉన్న స్నేహం కార‌ణంగానే ప‌వ‌న్ మాట్లాడ‌ర‌ని కూడా కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. కానీ వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు తోసిపుచ్చేందుకు జ‌న‌సేన ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఈ క్ర‌మంలోనే నిన్న‌టి మైన‌ర్ బాలిక రేప్ విష‌యమై జ‌న‌సేన మాట్లాడింది. నిర‌స‌న‌ల పేరిట ర‌చ్చ,ర‌చ్చ చేసింది. ఇదంతా బాగుంది కానీ జ‌న‌సేన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ పై ఓ స్ప‌ష్ట‌త అన్న‌ది లేకుండా ఉంద‌ని, ఇష్యూని రైజ్ చేసి వెళ్లిపోవ‌డం కాదు తుది వ‌ర‌కూ పోరాడాల్సిందేన‌ని అంటోంది మ‌రో వ‌ర్గం.

ఏదేమ‌యినా జ‌న‌సేన మాత్రం హోం మంత్రితో, ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఇత‌ర నాయ‌కుల‌తో త‌గువేసుకుంటామ‌ని ప‌రోక్షంగా చెబుతూ ఉంది. మైనర్లు ఉన్న ఈ కేసు విష‌య‌మై పోలీసులు మాత్రం ఒక‌టికి రెండు సార్లు అరెస్టుల విష‌యంలో ఆలోచిస్తున్నారు. మ‌రోవైపు పొలిటిక‌ల్ ఇన్వాల్మెంట్ ఉంద‌ని కూడా నిరూప‌ణ‌లో ఉండ‌డంతో ఆధారాలు ఉండ‌డంతో బీజేపీ కి ఇది ఓ విధంగా మైలేజీ పెంచే స్టోరీ కానుంది. కానీ ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని మ‌రోవైపు కొన్ని వ‌ర్గాల నుంచి వాద‌న వ‌స్తోంది. ఆ.. అమ్మాయి ప్ర‌తిఘ‌ట‌న అన్న‌ది వీడియోల్లో లేద‌ని కూడా వాదిస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ డ్ర‌గ్ ఫ్రీ, పబ్ ఫ్రీ హైద్రాబాద్ కోసం న‌గ‌ర యువ‌త ఎందుక‌ని ప‌ట్టుబ‌ట్ట‌లేక‌పోతుంద‌ని ! మాట‌ల‌న్నీ సోష‌ల్ మీడియాల‌కే ప‌రిమితం చేశాక, ఎవ‌రి త‌ప్పిదాలు వారు చేస్తూ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించ‌డం త‌గ‌ద‌ని మరో వాద‌న ఓ వ‌ర్గం నుంచి వినిపిస్తోంది. ఇంత జ‌రుగుతున్న‌ప్పుడు విద్యార్థి సంఘాలు ఏమ‌య్యాయి? ఎందుకు మాట్లాడ‌వు ?

మైన‌ర్ బాలిక రేప్ కు సంబంధించి ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికార పార్టీ, ఎంఐఎం పార్టీ నేత‌ల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని, న్యాయాన్ని నిల‌బెట్టాల‌ని కోరుతూ పోరుతూ విప‌క్ష పార్టీలు రోడ్డెక్కాయి. మాజీ జ‌ర్న‌లిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునంద‌న రావు ఓ మెట్టు పైకెక్కి మ‌రీ ! త‌న‌కు దొరికిన వీడియోలూ, ఫొటోలూ విడుద‌ల చేశారు మీడియాకు.! దీంతో త‌గాదా మ‌రింత రాజుకుంది. ఇంకొన్ని వీడియోలూ, ఫొటోలూ ఉన్నాయ‌ని, అవ‌న్నీ చూస్తే ఆ రెండు పార్టీలకూ చెందిన నాయ‌కుల పుత్ర ర‌త్నాలూ ఏం చేశార‌న్న‌ది స్పష్టం కావ‌డం త‌థ్యం అని అంటున్నారు ర‌ఘునంద‌న్. ఇదంతా ఓ వైపు న‌డుస్తుండ‌గా సీన్లోకి జ‌న‌సేన కూడా ఎంట‌రైంది. జూబ్లీ హిల్స్ పీఎస్ ద‌గ్గ‌ర హ‌ల్చ‌ల్ చేసింది. నిందితుల‌ను శిక్షించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతూ రాస్తారోకో స్థాయి నిర‌స‌న ఒక‌టి చేసింది. జ‌న‌సేన ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. అక్క‌డ కాస్త ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

మరోవైపు నిందితుల‌ను ఎన్కౌంట‌ర్ చేయాలి చేస్తారా అని ప్ర‌శ్నిస్తూ సోష‌ల్ మీడియా గ‌గ్గోలు మంటోంది. కానీ ఇదొక ఫేక్ వెర్ష‌న్ అని, రేప్ జ‌రిగిందేమీ లేద‌ని మరో వాద‌న కూడా వినిపిస్తోంది. అస‌లు మైన‌ర్ బాలిక‌ను ప‌బ్ లోకి ఎలా ఎంట‌ర్ చేయ‌నిచ్చార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. విప‌క్షాలు ఎంత గ‌గ్గోలు మంటున్నా ఎంఐఎం నుంచి పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న లేదు. నిన్న హోం మినిస్ట‌ర్ మ‌న‌వ‌డు పుర్ఖాన్ పేరు విన‌ప‌డితే, ఇవాళ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పేరు విన‌ప‌డింది.

అయితే ఈ కేసులో ప‌లు చ‌ట్టాల కింద నిందితుల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని డీసీపీ అంటున్నారు. కేసు ఎలా ఉన్నా, చ‌ట్టాల అమ‌లు ఎలా ఉన్నా, ఒక్క మాట మాత్రం బ‌లీయంగా వినిపిస్తోంది. అస్స‌లు హైద్రాబాద్లో ప‌బ్ లు ఎందుకు మూయించ‌డం లేద‌ని వాద‌న ఒక‌టి సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. దీనికి మాత్రం పోలీసులు ఎందుకు ఆన్స‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నారు అని కీల‌కం అయిన ప్ర‌శ్న ఒక‌టి చ‌ర్చ‌కు తావిస్తోంది. డ్ర‌గ్ ఫ్రీ హైద్రాబాద్ కోసం బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోరు బాట‌లో న‌డిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయని కూడా అంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version