గత వారం రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పవన్ తన మూడవ భరతో దూరంగా ఉంటున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనసేన నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా జనసేన తెలుపుతున్న సమాచారం ప్రకారం పవన్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు మరియు అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు, వారి అనుబంధ యు ట్యూబ్ ఛానెల్స్ మరియు మీడియా సంస్థలు వీటన్నింటిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం అంటూ జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
జనసేన: వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
-