పిఠాపురం మున్సిఫల్ ఆఫీస్ ఎదురుగా జనసైనికులు ఆందోళన..!

-

కాకినాడ లోని పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయిన పిఠాపురం లో జన సైనికులు ఆందోళన చేపట్టారు. పిఠాపురం మున్సిఫల్ ఆఫీస్ ఎదురుగా జన సైనికులు ఈ ఆందోళన చేస్తున్నారు. అయితే మున్సిఫల్ అధికారులు జనసేన కు సంభందించిన ఫ్లెక్సీలు తొలగించారని.. అందుకు నిరసనకు ఈ ఆందోళన చేపట్టారు జన సైనికులు. అయితే ప్లెక్సీలు పెట్టిన 24 గంటలు తరువాత తొలగించాలని మున్సిఫల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలు మేరకు ఫ్లెక్సీలు తొలగించామంటున్నారు మున్సిఫల్ అధికారులు.

అయితే అక్కడ టీడీపీ కి చెందిన ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం జనసేన కు చెందిన ఫ్లెక్సీలు మాత్రమే ఎందుకు తొలగించారంటూ మున్సిఫల్ అధికారులు పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తొలగించే ముందు సమాచారం ఎందుకు ఇవ్వలేదు అంటూ మంది పడుతున్నారు జన సైనికులు. అయితే అప్పటికప్పుడు టీడీపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు కూడా మున్సిపల్ అధికారులు తొలగించడంతో జన సైనికులు తమ ఆందోళన విరమించారు.

Read more RELATED
Recommended to you

Latest news