ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రమదాన కార్యక్రమం.. ఆ ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ రాక.

-

గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రమదానానికి పూనుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం జరగనుంది. రోడ్ల గుంతలను పూడ్చేందుకు ఈ శ్రమదానాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రోడ్ల గుంతలపై ప్రభుత్వంపై విమర్శలు కూడా చేసారు. ఆంధ్రప్రదేశ్ లొ రోడ్ల పరిస్థితి బాగాలేదని, అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యారని కామెంట్లు చేసారు. ప్రస్తుతం శ్రమదాన కార్యక్రమంలో రోడ్ల గుంతలను పూడ్చి నిరసన వ్యక్తం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరవుతున్న పవన్ కళ్యాణ్, బాలాజీపేటలో జరిగే సభకు వస్తున్నారు. ఆ తర్వాత హుకుంపేటలో రోడ్ల గుంతలను పవన్ కళ్యాణ్ పూడ్చనున్నారు. అనంతరం పుట్టపర్తి సమీపంలో కొత్త చెరువు ప్రాంతంలో పవన్ కళ్యాణ్, శ్రమదానం చేయనున్నారు. కొత్త చెరువు వద్ద జరిగే సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version