వారం గడవక ముందే మరో తుఫాను దేశాన్ని వణికిస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. గులాబ్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాగు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు నదులను తపలించాయి. ప్రస్తుతం మరోతుఫాను కలవరపెడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ షహీన్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తోంది. 7 రాష్ట్రాలపై తుఫాను ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. తుఫాన్ తోపాటు నైరుతి రుతుపవనాల తిరోగమనం కూడా ప్రారంభం అవుతుండటంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చిరిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి సమీపంలో తుఫాను కేంద్రీక్రు.తం అయి ఉంది.
ముంచుకొస్తున్న షహీన్… 7 రాష్ట్రాలకు హై అలెర్ట్
-