ఏపీలో పోలింగ్ రోజున మొదలైన గొడవలు ఇంకా పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఘటనలపై ఈసీ సీరియస్ అయింది.ఘర్షణలపై సిట్ కూడా దర్యాప్తు జరిపి ఈసీకి నివేదిక కూడా అందజేసింది.ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని ,ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ రాసిందని తెలిపారు.
ఏపీలో అల్లర్లు, అలజడులను ఆపడంలో సీఎస్ జవహర్ రెడ్డి విఫలమయ్యారు. డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చలేదు అని పేర్కొన్నారు. సీఎస్ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉంటే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని ఈసీ కి లేఖ రాశాం. సిఎస్ నిన్న వైజాగ్‌కు రహస్యంగా ఎందుకు వెళ్లారో తెలియడం లేదు. సిట్ దర్యాప్తు సరిగ్గా లేదు. పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో అమాయకులను అరెస్టు చేశారు అని ఆరోపించారు.