ఈసీ కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది .కేవలం అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై చర్చించాలని అనుమతించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రీ నేత సోనియా గాంధీని ముఖ్యఅతిథిగా పాల్గొనాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన బీజేపీ నేత కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాలేదని, అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఏ ప్రాతిపదికన ఆమెను పిలుస్తారని ప్రశ్నించారు. వందల మందిని బలి తీసుకున్న సోనియాను పిలవడమేంటని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.