ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కీలక సూచనలు చేసింది. రక్షణ దళాల కార్యకలాపాలకు సంబంధించి రాజకీయ ప్రచారానికి పాల్పడొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రాజ్యాంగం రద్దు చేస్తారంటూ తప్పుదు అభిప్రాయాలను కలిగించే ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి ఆదేశాలు వచ్చాయి.
ఈ ఆదేశాలకు కొన్ని గంటల ముందు హర్యానాలో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని అన్నారు. తాజాగా ఎన్నికల సంఘం పంపిన ఆదేశాల్లో ప్రముఖంగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యాల్ని అవకాశంగా ఉపయోగించుకుంటున్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.