జాన్వి కపూర్, ఈ అందాల బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో జాన్వి అందాల దోస్ పెంచుతూ మంత్ర ముగ్దులను చేస్తుంది. వెరైటీ డ్రెస్సులతో జాన్వి చేసే రచ్చ కి కుర్రాళ్ళు మతులు పోతున్నాయి. అయితే.. తాజాగా ప్రేమపై సంచలన వ్యాఖ్యలు చేసింది జాన్వి కపూర్.
జాన్వి కపూర్ తన సోదరి ఖుషి కపూర్ కి డేటింగ్ సలహాలు ఇస్తుంది. ఒకవేళ డేటింగ్ చేయాల్సి వస్తే నటుడితో మాత్రం అస్సలు చేయకూడదని తన సోదరికి చెబుతానని జాన్వి చెప్పింది .తను తన సోదరి ఒకే మనస్తత్వం కలిగిన వారిమని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా కుషి కపూర్ ‘ది ఆర్చీస్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. మరోవైపు ఇప్పటికే తెరంగేట్రం చేసిన జాన్వి కపూర్ వరుస సినిమాలతో అలరిస్తోంది.