మహారాష్ట్రలో హై టెన్షన్ : ఒకే రోజు నాలుగుసార్లు కంపించిన భూమి..!

-

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వరుస భూప్రకంపనలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. 24 గంటల్లో 4 సార్లు భూమి కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత అతి తక్కువగా నమోదు కావడంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మొదట ఆదివారం ఉదయం 11.39 గంటలకు సాయంత్రం 5.23 గంటలకు 2వ సారి, ఆ తర్వాత 6.47 గంటలకు 3వ సారి భూకంపం సంభవించింది.

దీని తీవ్రత 3.1గా నమోదైంది. సాయంత్రం 7:30 గంటల సమయంలో 4వ సారి భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. ఈ భూప్రకంపనలతో బయపడిపోయిన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఇకపోతే 2018, 2019 లలో కూడా పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version