సీఎం అధికార నివాసంగా మారబోతున్న జయలలిత ఇల్లు..!

-

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికార నివాసంగా మార్చాలని పళనిస్వామి ప్రభుత్వం భావిస్తోంది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోయెస్ గార్డెన్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. ఓ నివాసాన్ని.. స్మార‌కంగా మార్చ‌డం కొత్తేమీ కాదు అని,  ప్ర‌జ‌ల మ‌నుసులు గెలుచుకున్న‌ అనేక మంది నేత‌ల కేసుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని జ‌డ్జి తెలిపారు.

వేద నిల‌యాన్ని స్వాధీనం చేసుకునేందుకు మే నెల‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. అలాగే జ‌య‌ల‌లిత‌కు చెందిన స్థిర‌, చ‌ర ఆస్తుల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ విజ‌య్ నారాయ‌ణ్ కోర్టుకు తెలియ‌జేశారు.  జ‌స్టిస్ ఆనంద్ వెంక‌టేశ్ ఈ కేసును విచారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version