కూతురి కర్కశత్వం.. డబ్బు, నగలు లాక్కుని కన్న తల్లిని అడవిలో వదిలేసి!

-

కన్న తల్లి పట్ల ఓ కూతురు కర్కశత్వంగా వ్యవహరించింది. తన వద్దనున్న డబ్బు, నగలు లాక్కుని ఆమెను ఏకంగా అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాలో చోటుచేసుకోగా.. గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.

స్థానికుల కథనం ప్రకారం.. ఇస్లాంపురాలోని ఓ వీధిలో నివసించే వృద్ధురాలు బుధవ్వను కూతురు ఈశ్వరి నగలు, డబ్బులు లాక్కుని గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి అడవిలో వదిలేసినట్లు సమాచారం. రెండు రోజులుగా ఆకలి, దాహంతో అలమటించిన బుధవ్వను శ్రీరాములపల్లి యువకులు రక్షించి, సంక్షేమ అధికారులకు సమాచారం అప్పగించారు. దీంతో ఆ వృద్ధురాలిని సఖి సెంటర్‌కు తరలించారు. బక్క చిక్కిన శరీరంతో ఆ వృద్దురాలి బాధ అందరినీ కలిచివేసింది.

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news