జేసీ – భూమా కుటుంబాలు ఆటలో అరటిపండ్లేనా?

-

ఏపీలో టీడీపీ జాతీయ కమిటీల ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలిట్ బ్యూరో లిస్ట్ కూడా విడుదలయింది. అయితే ఈ లిస్ట్ లో అనంతపురానికి చెందిన జేసీ కుటుంబానికి కానీ.. కర్నూల్ జిల్లాకు చెందిన భూమా కుటుంబాలకు కానీ.. ఎక్కడా ప్రాతినిధ్యం కనిపించలేదు. ప్రస్తుతం సీమ కం ఏపీ టీడీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది!

అందుకు గల కారణాలు ఏమిటా అని ప్రశ్నించుకుంటున్న టీడీపీ నేతలకు ప్రస్తుతం సమాధానాలు దొరకని పరిస్థితి! కొత్తగా పార్టీలోకి వచ్చారు కదా అనుకుందామంటే పితాని సత్యనారాయణకు ఆ అవకాశం ఇచ్చారు! పోనీ కేసులు ఉన్నాయికదా అనుకుందామంటే… అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు పెద్ద పోస్టులే కట్టబెట్టారు. మరి వీరిలో బాబుకు కనిపించిన లోపాలేమిటి.. లోటేమిటి?

ఇప్పుడు సీమ టీడీపీ తమ్ముళ్లకు “అర్ధం కాని బాబు చర్యల్లో” ఇదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది! జేసీ కుటుంబానికి పెద్ద పీట వెయ్యకపోవడానికి కారణం… పరిటాల కుటుంబం పట్టుదలే కారణం అని కామెంట్లు వినిపిస్తున్నాయి! మరి జేసీ ఫ్యామిలీని, భూమా ఫ్యామిలీని బాబు పూర్తిగా పక్కనపెట్టేశారు అనుకోవాలా లేక ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని భావించాలా లేక.. “బాబుకు ఇది కొత్తేమీ కాదు” అని సరిపెట్టుకోవాలా అనేది తెలియాలంటే.. వేచి చూడాలి!!

ఏది ఏమైనా టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎంపీలుగా ఒక వెలుగు వెలిగిన ఈ రెండు ఫ్యామిలీలు ఇప్పుడు పార్టీలో అటూ ఇటూ కాకుండా.. ఆటలో అరటిపండ్లు అయిపోయారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news