ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రాక సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. ఆయన కాన్వాయ్ వెళ్లాక ఇతర వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు వెళ్లిన 30 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది.
ఏపీ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్షకు ఆలస్యం జరిగిందని పేరెంట్స్ చెబుతున్నారు. పెందుర్తి అయాన్ డిజిటల్ సెంటర్‌కు జేఈఈ అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో వారిని లోనికి అనుమతి ఇవ్వకపోవడంతో 30 మంది విద్యార్థులను పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తమ పిల్లల భవిష్యత్ ఆగం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.