ఏపీలో కూటమి సర్కారుకు వరుసగా షాకులు తగులుతున్నాయి.తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ అటు రైతులు, ఉద్యోగులు, సామాన్యులు ఏదో విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.
తాజాగా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. రొయ్యకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చేశారు.ప్రాసెసింగ్ యూనిట్ల యజమానుల దోపిడిని అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.లేనియెడల ఈ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.