JEE Mains 2022: జేఈఈ మెయిన్‌ మరోసారి వాయిదా

-

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ ను ఎన్టీఏ మరోసారి వాయిదా వేసింది. ఇండియా వ్యాప్తంగా.. విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్‌ లో, రెండో విడత జులై లో నిర్వహించనుంది.

తొలి విడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసి పోయింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. సీబీఎస్‌ఈ తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు, హయ్యర్‌ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్‌, మే నెలల్లో జరుగుతున్నాయి.

అదే సమయంలో.. జేఈఈ మెయిన్‌ కూడా జరుగుతుండటంతో.. విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. రెండు పరీక్షలూ కీలకమైనవి కావడంతో.. దేని పై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు.  ఈ నేపథ్యంలోనే జేఈఈ మెయిన్ మరోసారి రి షెడ్యూల్ చేసింది. ఏప్రిల్ లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ మెయిన్ జూన్ కి వాయిదా వేయగా… జూన్ 20 నుండి 29 వరకు జరుగనున్నాయి. మేలో జరగాల్సిన రెండో విడత జులై 21 నుండి 30 వరకు జరుగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version