అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లోని గ్రూప్-1 ఆఫీసర్లకు షాక్ ఇస్తూ…వివాదస్పద నిర్ణయం తీసుకుంది. పేషీల్లో పని చేస్తోన్న ఓఎస్డీలను.. పీఎస్, అడిషనల్ పీఎస్సులను పేరేంట్ డిపార్ట్మెంటుకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.
తిరిగి మంత్రుల పేషీల్లోకి రావాలంటే మాతృశాఖ నుంచి మళ్లీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. జిల్లాల విభజన తర్వాత పేషీల్లోని చాలా మంది గ్రూప్-1 అధికారులకు ప్రమోషన్లు ఇచ్చింది. ప్రమోషన్లు రావడంతో మాతృశాఖకు పంపింది ఏపీ ప్రభుత్వం.
తిరిగి పేషీల్లోకి రావాలంటే మంత్రుల అనుమతి తప్పనిసరి అంటోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే… మంత్రుల పేషీల్లోని అధికారులకు.. సిబ్బందికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. పేషీల్లోని అధికారులు, సిబ్బంది వివరాలను సేకరిస్తోంది జీఏడీ. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా షురూ కానుంది. ఇక ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు అ సంతృప్తి గా ఉన్నారు.