అమిత్ షాను కలిసిన బండి సంజయ్.. ఇద్దరి మధ్య కీలక చర్చలు!

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అదే శాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కేంద్రమంత్రి బండి సంజయ్ వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేసి సత్కరించారు. అనంతరం అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇరువురు కాసేపు సమావేశం అయినట్లు తెలుస్తోంది.

ఇందులో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాఖాపరమైన చర్చలు కూడా జరిగినట్లు సమాచారాం. రాష్ట్రంలో బీజేపీకి కొత్త చీఫ్‌ను నియమిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, నేటికి ఆ విషయం కొలిక్కి రాలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత స్టేట్ బీజేపీ చీఫ్ నియామకంపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. కాగా, సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version