కేసీఆర్ బిడ్డ బతుకమ్మ ఆడితే సరిపోద్దా.. అంటున్న జీవన్‌రెడ్డి..

-

ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఊబిలో కూరుకుపోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించిన విష‌యం తెలిసిందే. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం ప్రభుత్వంలో వీలీనం చేశారని.. ప్రభుత్వం కుట్ర పూరితంగా కార్మికులను సమ్మె వైపు పురికొల్పిందని
జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే సీఎం కేసీఆర్ కుట్రలను తిప్పి కొట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన అనంతరం జీవన్‌రెడ్డి.. ప్రయాణికుల గోడు కేసీఆర్‌కు పట్టదా? అని ప్రశ్నించారు. సమ్మెకు బాద్యులు కేసీఆరేనన్నారు. కేసీఆర్ బిడ్డ బతుకమ్మ ఆడితే సరిపోద్దా.. ప్రజలకు పండగ వద్దా అని నిలదీశారు. కేసీఆర్‌కు కార్మికుల ఉసురు తగులుద్దని పేర్కొన్నారు. కేసీఆర్ అగ్గితో పెట్టుకున్నాడని.. మాడి మసి కాక తప్పదని జీవన్‌రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version