అదృష్టం.. దురదృష్టం ఎవరిని ఎలా వెంటాడతాయో ఎవరికి తెలియదు. అయితే కర్ణాటకలోని మహ్మద్ ఫయాజ్కి మాత్రం చిన్నతనం నుండి అన్ని దురదృష్టాలే వెంటాడాయి. తన కన్న తల్లిదండ్రులిద్దరూ కిడ్నీ జబ్బుతో చనిపోయారు. ఇక మంచిగా చదువుకొని దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేసుకొని గొప్పగా బ్రతకాలి అనుకున్నాడు. కానీ అది కూడా కలలాగే మిగిలిపోయింది.
ప్రస్తుతం ముంబైలోని ఓ కంపెనీలో అకౌంటెంట్ గా జాబు చేస్తున్నాడు. అయితే మనకు కూడా ఎప్పుడో ఒకసారి అదృష్టం రాకపోతుందా అని ఎదురుచూసాడు. ఈ క్రమంలోనే ఆరు సార్లు లాటరీ టికెట్ కొన్నాడు. చివరగా అతడిని అదృష్టం వరించింది. ఏకంగా ఆ లాటరీలో 23 కోట్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. వారి ఆనందాలకు అవదులు లేదు. అయితే మహ్మద్ ఫయాజ్ వచ్చినా డబ్బుతో తన సోదరుడుని చదివిస్తానని సంతోషంగా చెపుతున్నాడు.