ఉద్యమానికి ముందు కవిత ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత..? – జీవిత రాజశేఖర్

-

తెలంగాణ ఉద్యమానికి ముందు కవిత ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత..? అని నిలదీశారు జీవిత రాజశేఖర్. పబ్‌లు, క్లబ్‌లలో కేటీఆర్‌కు షేర్ ఉందని యజమానులు నాతో చెప్పారు.. టీఆర్ఎస్ నేతలు తప్పు చేయనప్పుడు నిజం ఏంటో ధైర్యంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు జీవిత రాజశేఖర్.

 

మునుగోడు లో తెరాస పార్టీకి షాక్ ఖాయం…ఇది సరైన పద్దతి కాదని ఆగ్రహించారు. మీకు దైర్యం ఉంటే మీరు పాదయాత్ర చేయండి..అని తెరాసా కు సవాల్ విసిరారు జీవిత రాజశేఖర్.

పిచ్చి చేస్టలు మాని సంజయ్ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుమ్మడి కాయలు దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉందన్నారు.మీరు తప్పు చేయనప్పుడు ఆ నిజం ఎంటో దైర్యంగా నిలబడి మాట్లాడి నిజాన్ని బయట పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు.కానీ బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం మీ గొప్పతనం అనుకుంటున్నారా? మీరూ బీజేపీ నీ ఏమీ చేయలేరు? అని చెలెంజ్ చేశారు జీవిత రాజశేఖర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version