తల్లి పాలతో జ్యూవెలరీ… 2023 కి పదిహేను కోట్లు టర్న్ ఓవర్ వస్తుందని అంచనా..!

-

ఈ మధ్య కాలం లో ఎన్నో కొత్త కొత్తవి వస్తున్నాయి. చాలా మంది తల్లిపాలను దాచుకోవాలని తల్లిపాలతో జ్యూవెలరీని తయారు చేయించుకుంటున్నారు. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ ఫేస్ అంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకనే ఆ ఫేస్ లో ఉన్న ప్రతిదీ కూడా దాచుకోవాలని జ్ఞాపకంగా ఉంచుకోవాలని అనుకుంటారు చాలా మంది తల్లులు.

 

ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ మిల్క్ జ్యూవెలరీ బాగా పాపులర్ అయింది. వీటితో జ్యూవెలరీ తయారుచేసుకుని ఉంచుకుంటే ఎల్లప్పటికీ జ్ఞాపకంగా ఉండిపోతాయి. సఫియా మరియు రియాధ్ ఒక ఇండస్ట్రీని మొదలు పెట్టారు. వాళ్లు బ్రెస్ట్ మిల్క్ జ్యూవెలరీ ని తయారు చేస్తున్నారు. 2023 నాటికి 15 కోట్ల టర్నోవర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువ అవడంతో వారి యొక్క ఆదాయం బాగుంది పైగా బ్రెస్ట్ మిల్క్ తో చెవి రింగులు, ఉంగరాలు, పెండెంట్స్ వంటివి తయారు చేయించుకుంటున్నారు.

పైగా బ్రెస్ట్ మిల్క్ తో జ్యూవెలరీ చేసి దాచుకోవడం ఎంతో బాగుంటుందని ఆమె చెప్పారు. వాటిని తయారు చేసేటప్పుడు మెజెంటా ఫ్లవర్స్ ని అందులో వేస్తారని ఇది సెంటిమెంటల్ కనెక్షన్ ని తల్లికి బిడ్డకి ఇస్తుందని ఆమె చెప్పారు. సఫియా బ్రెస్ట్ మిల్క్ ను ఇలా జ్యువెలరీ కింద మార్చడానికి చాలా రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ అవసరమని చెప్పారు. ఈమె ముగ్గురు పిల్లలకి తల్లి పైగా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎలా ఉంటుందో ఆమెకి బాగా తెలుసని ఇలా జ్యువెలరీను తయారు చేసి దాచుకోవడం తల్లులకు ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news