హైకోర్టును ఆశ్రయించిన టెన్త్ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి

-

నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. పేపర్ లీక్ ఘటనలో ఝాన్సీ లక్ష్మి అనే విద్యార్థినిని బాధ్యురాలిని చేస్తూ విద్యాశాక అధికారులు డిబార్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బాధిత విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తన డిబార్‌ను రద్దుచేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో విద్యార్ధిని కోరింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ DEO, MEO, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌లను విద్యార్థిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది. కాగా, ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అధికారులు, ఆకతాయిల తప్పిదానికి తనను బలి చేసారంటూ పిటీషన్‌లో ఝాన్సీ లక్ష్మి పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news