చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా దారుణం : సుప్రీంకోర్టు

-

అన్యాయంగా చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చెట్లను నరికినందుకు గాను ఓ వ్యక్తికి ఒక్కో చెట్టుకు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని దాల్మియా వ్యవసాయ క్షేత్రంలో శివశంకర్ అగర్వాల్ అనే వ్యక్తి 454 చెట్లను నరికినట్లు సమాచారం.

ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి రాగా.. చెట్లు కల్పించే పచ్చదనాన్ని తిరిగి సృష్టించేందుకు కనీసం వందేళ్ల సమయం పడుతుందని.. చట్టవిరుద్ధంగా నరికిన చెట్లకు ఒక్కో దానికి రూ.1 లక్ష చొప్పున చెల్లించాలని, అంతేకాకుండా ఆ ప్రదేశంలో తిరిగి చెట్లను నాటాలని శివశంకర్ అగర్వాల్‌కు జరిమానాతో పాటు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news