Jharkhand: ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ !

-

ఝార్ఖండ్ లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో ఆ పార్టీ శాసనసభపక్ష నేతగా ఉన్న చంపై సోరెన్ ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ క్రమంలో నూతన ముఖ్యమంత్రి గా చంపైను ప్రకటించినట్లు  జాతీయ మీడియా పేర్కొంది.

ప్రస్తుతం భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ కి బుధవారం మధ్యాహ్నం నుంచి 6 గంటలకు పైగా విచారణ జరగుతుంది. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా హేమంత్ సోరెన్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.జేఎంఎం సీనియర్ నేతగా, హేమంత్ సోరెన్క నమ్మకస్థుడిగా ఆయన పేరొందారు. హేమంత్ మంత్రి వర్గంలో కీలక శాఖల్లో పనిచేశారు. ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించడంతో ఝార్ఖండ్ టైగర్ గా ఆయన ప్రసిద్ధి చెందారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా సరైకేలా నుంచి గెలిచిన చంపై ఆ తర్వాత జేఎంఎంలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news