కాంగ్రెస్ లోకి క‌న్హ‌య్య‌, జిగ్నేష్..ముహూర్తం ఫిక్స్..!

బీహార్ లో సీపీఐ కీల‌క‌నేత ఎమ్మెల్య క‌న్హ‌య్య కుమ‌ర్ మ‌రియు గుజ‌రాత్ కు చెందిన యువ‌నేత ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ యువ నాయ‌కుల చేరిక దాదాపు ఖ‌రారైన‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ 28న రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ఈ ఇద్ద‌రు నాయ‌కులు కాంగ్రెస్ లో చేర‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ రాజ‌కీయాల్లో జిగ్నేష్ మేవాని సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌ధాని రాష్ట్రంలో బీజేపీ హ‌వా ఉన్న స‌మ‌యంలో జిగ్నేష్ గెలిచి అంద‌రి దృష్టిని త‌నవైపు తిప్పుకున్నారు. అంతే కాకుండా జిగ్నేష్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా భ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ స‌పోర్ట్ తోనే ఆయన గెలిచారు. ఇక సీపీఐ నుండి గెలిచిన క‌న్హ‌య్య కాంగ్రెస్ ఆహ్వానంతో పార్టీలో చేరుతున్నారు.