Bigg Boss 5: అత‌డే బిగ్ బాస్ 5 టైటిల్ విన్న‌రంట‌! గూగుల్ సెర్చింగ్లో షాకింగ్ రిసాల్ట్స్‌ !!

-

Bigg Boss 5: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో తొలిరోజు నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజ‌న్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్‌నైనా… నువ్వానేనా అన్నట్టు ర‌స‌త‌వ‌త్త‌రంగా ఆడుతున్నారు. టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలని కసితో పోరాడుతున్నారు. ఈ షో రెండు ఎలిమినేష‌న్ల పూర్తి చేసుకోని.. మూడోవారంలో విజ‌య‌వంతంగాసాగుతుంది. ఇక 80 రోజుల పైగా ఆట కొన‌సాగ‌నున్న‌ది.

కాగా, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న‌ట్టు బిగ్ బాస్ 5 టైటిల్ విన్న‌ర్ సింగర్‌ శ్రీరామచంద్ర విన్నర్‌ అని డిక్లేర్‌ చేసింది గూగుల్. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం అవక్కు అవుతున్నారు. శ్రీరామ్‌ అభిమానులు మాత్రం.. గూగుల్ ముందుగానే గుర్తు ప‌ట్టిందోచ్ అంటూ పండుగ చేసుకున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. గూగుల్ సెర్చ్ బార్‌లో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరని టైప్ చేస్తే..
శ్రీరామచంద్ర పేరును సూచిస్తోంది. శ్రీరామ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, నటుడు అని, అంతేకాకుండా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తోంది. ఇక ఇదే గూగుల్‌లో బిగ్‌బాస్‌ 5 తెలుగు టైటిల్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది. మ‌రో సారి వీజే స‌న్నీ పేరును కూడా చూపిస్తుంది. దీంతో ఈ గూగుల్‌ తప్పిదాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news