జియో కస్టమర్ కేర్ పేరుతో ఒక కొత్త రకం సైబర్ మోసం వెలుగు లోకి వచ్చింది. జియో కస్టమర్లకు మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ.. రిచార్జ్ చేయాలంటూ కస్టమర్ కేర్ పేరుతో మెసేజ్ పంపిస్తున్నారు కేటు గాళ్ళు. రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రిచార్జ్ చేయమని చీటర్స్ చెబుతున్నారు.
యాప్ ద్వారా అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తోంది సదరు ముఠా. ఇదే విధంగా ఇద్దరు మహిళల నుండి 2.7 లక్షల రూపాయలను వసూలు చేసింది సదరు ముఠా. దీంతో వారిద్దరూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు జియో కస్టమర్లు సైబర్ చీటర్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో జియో కస్టమర్ లు జాగ్రత్తగా ఉండండి ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ని క్లిక్ చేసి ఇబ్బంది పడకండి.