ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి కలిసొచ్చిందా..టీ పీసీసీ రేసులో ఊహించని మలుపు

-

ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి కలిసొస్తుంది అనేది సామెత. ఇది తెలంగాణ కాంగ్రెస్ కి అచ్చు గుద్దినట్టు సరిపోయేట్టు ఉంది అనేది టాక్. ఇప్పటికే పార్టీలో రెండుగా చిలిన నాయకుల వైఖరి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాగూర్ రాహుల్ గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చించినట్లు సమాచారం. 162 మంది నేతల అభిప్రాయాలు సేకరించామన్నారు ఠాగూర్. అభిప్రాయాలు సోనియా, రాహుల్‌కు అందిస్తామని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌పై తుది నిర్ణయం అధిష్టానానిదేనని తేల్చి చెప్పారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది.

టీపీసీ చీఫ్ రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా ఠాగూర్ వద్దకు వెళ్లిన టీం…తాము సూచించిన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుంటే పార్టీలో పని చేయలేమని తేల్చి చెప్పింది. ప్రత్యర్థి రేవంత్ టీం కూడా తనకు పీసీసీ ఇవ్వకపోతే పార్టీ బతకడం కష్టమని చెప్పుకుంటూ వస్తుంది. ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కొట్లాడితే… ప్రత్యామ్నాయ ఆలోచన కూడా పార్టీ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు సీనియర్లు అవసరం అయితే జానారెడ్డి పేరు కూడా సూచించాలని భావిస్తున్నారు. మేడంని కలిసి ఇలాంటి ప్రతిపాదన తేవాలని చూస్తున్నారు.

రెడ్డి సామాజిక వర్గం మధ్య ఆధిపత్య పోరు జరిగితే ఏంటన్న వాదన కూడా ఉంది. ఇటీవల యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించే అంశంపై అధిష్టానం లోని ఓ పెద్దయాన్ని కలిశారట యూత్ కాంగ్రెస్ నాయకులు. త్వరలోనే పీసీసీ క్లియర్ అయ్యేట్టు ఉంది..ఆ తర్వాత చూద్దాం …దాని కోసమే వెయిటింగ్ అన్నారట. కొనసాగింపుగా… రెడ్ల మధ్య పంచాయతీ తో పార్టీకి కొత్త తలనొప్పులు వస్తాయి కాబట్టి..నాన్ రెడ్డి కి ఇస్తే ఎలా ఉంటుందని చర్చ ఓ CWC సభ్యుడి వద్ద జరిగిందట. అధిష్టానం మనసులో కూడా ఇదే ఉందా.. ఇద్దరు రెడ్డి సామాజికవర్గం ఎంపీల మధ్య పంచాయతీ …నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటారా అనే టాక్ మొదలయింది. నాన్ రెడ్డి అంటే బీసీ లాకా..బ్రాహ్మణ సామాజికవర్గం కొటలోకి వెళ్తుందా..లేదంటే దళితుల కి వెళ్తుందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చకు దారి తీస్తుంది.

పీసీసీ అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుంది అని ఠాగూర్ చెప్పిన నేపథ్యంలో ఇంతలో సీనియర్లు రాహుల్..సోనియాగాంధీ లను కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఠాగూర్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు

Read more RELATED
Recommended to you

Latest news