ప్రీ పెయిడ్ ప్లాన్ రూ. 799ను తొలగించారనే ప్రచారాన్ని జియో కొట్టి పారేసింది. యూజర్లు ఈ ప్లాన్ ను వినియోగించుకోవచ్చు అని వెల్లడించింది. ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా రూ. 799 రీఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూజర్ల అవసరాలకు తగినట్లుగా ప్లాన్ లను అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. కాగా, ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్, రోజుకి 1.5 జిబి డేటాను 84 రోజుల వ్యాలీడిటీతో అందిస్తోంది జియో సంస్థ.

ఇది మాత్రమే కాకుండా జియో సంస్థ అనేక రకాల ప్యాకేజీలను తక్కువ ధరకే తీసుకువస్తోంది. సామాన్య మానవులు, నిరుపేదలు, ప్రతి ఒక్కరూ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటున్నారు. జియో సంస్థ తీసుకువచ్చిన ఈ అవకాశంతో ప్రతి ఒక్కరూ ఎంత దూరంలో ఉన్నా సరే ఇతరులకు ఫోన్లు చేసుకుంటూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. దూర ప్రాంతంలో ఉన్నవారికి జియో సంస్థ అపరిమిత కాల్స్ ను తీసుకువచ్చినప్పటినుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా వారికి నచ్చిన వ్యక్తులతో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. జియో సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.