జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అక్కితం మృతి..!

-

మలయాళ మహా కవి అక్కితం అచ్చుతమ్ నంబూద్రి ఈరోజు చనిపోయారు.. త్రిసూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. అచ్చుతమ్ నంబూద్రి వయసు 94 సంవత్సరాలు. కేరళ సాహిత్యంలో తన రచనలతో ఒక కొత్త ఉత్సహంను తీసుకువచ్చినట్లు అక్కితంను మలయాళీలు అభిమానిస్తారు అయితే గత ఏడాది జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఆయన గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కితంకు ఆ అవార్డును అందజేశారు.

అత్యున్నత సాహితీ అవార్డు జ్ఞానపీఠ్‌ను ఓ కేరళ కవి గెలుచుకోవడం ఇది ఆరవసారి కావడం గమనార్హం. అయితే కోవిడ్ మహమ్మారి వైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌తో అవార్డు అందజేత కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేశారు. బ్రతికి ఉన్న మలయాళీ కవుల్లో అక్కితం సాహిత్యం అద్భుతమైందని సీఎం విజయన్ అన్నారు. మలయాళీ ప్రజలు అక్కితంను మహాకవిగా భావిస్తుంటారు. ఆధునిక సాహిత్యానికి వన్నె తెచ్చినట్లు చెబుతుంటారు. ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్‌గా మూడు దశాబ్ధాల పాటు పనిచేశారంటే అయన గురించి వేరే చెప్పక్కర్లేదు.. అలాంటి గొప్ప కవి ఈరోజు మన మధ్య లేరనే వార్తను మలయాళీలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయన మరణానికి పలువురు సంతాపం వ్యక్తం చేసారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version