గుంటూరు తాలూకా కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేసారు. ఉద్యోగ ఉపాధ్యాయ,కార్మిక పెంక్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి ఇందులో పాల్గొనడం జరిగింది. బండి శ్రీనివాసరావుఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్ చేసారు. ఉద్యోగులకు రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, 12వ పీఆర్సీని విడుదల చేయాలి అని అన్నారు.
ఈ నెల14వ తారీకు నుంచి తాలూకా స్థాయి నుంచి ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వం మాకు న్యాయంగా రావలసిన12వ పీఆర్సీ, బకాయి డిఎలు, ఇవ్వాలని కోరడం నేరమా అని అన్నారు.పీఆర్సీకోసం పోరాటం చేస్తే ఇంతవరకు వాటిని కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.