నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఖాళీలు..వివరాలివే…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థ తిరుచిరపల్లిలోని క్యాంపస్‌లో పలు ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇక దీని కోసం మరిన్ని వివరాలని చూస్తే.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫ్యాకల్టీ పోస్టులను ఎంపిక చేయనుంది. దీనిలో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వయస్సు వచ్చేసి 35 ఏళ్లు ఉండాలి.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, అర్కిటెక్చర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 జీతంగా ఇవ్వనున్నారు.

అభ్యర్థులను మొదట పని ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తరవాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ 02-01-2022న మొదలవ్వగా 16-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://www.nitt.edu/ లో చూడచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version