సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్‌కు విరాట్ దూరం!

-

సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్ ముందు టీమిండియా కు భారీ షాక్ త‌గిలిన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఫిట్ నెస్ లేకుండా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అయితే టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్ కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని సమాచారం. అయితే సౌత్ ఆఫ్రికాతో మొద‌టి టెస్ట్ మ్యాచ్ గెలిచిన అనంత‌రం కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్ను నొప్పి రావ‌డంతో రెండో టెస్టు మ్యాచ్ నుంచి అనూహ్యంగా త‌ప్పుకున్నాడు.

అయితే కోహ్లి ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణాలో ఉన్నాడ‌ని రెండో టెస్టు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన కె ఎల్ రాహుల్ తెలిపాడు. అయితే విరాట్ కోహ్లి వెన్ను నెప్పి ఇంకా త‌గ్గ‌లేద‌ని తెలుస్తుంది. అందు కోసమే సౌత్ ఆఫ్రికాతో జ‌ర‌గ‌బోయే వ‌న్డే సిరీస్ కు విరాట్ కోహ్లి దూరం కాబోతున్నాడ‌ని స‌మాచారం. అయితే విరాట్ కోహ్లి సౌత్ ఆఫ్రికా టూర్ కు రాక‌ముందే తాను వ‌న్డే సిరీస్ ఆడ‌న‌ని బీసీసీఐ కి తెలిపాడ‌ని స‌మాచారం. అయినా విరాట్ కోహ్లిని వ‌న్డే సిరీస్ జ‌ట్టుతో సెల‌క్టింగ్ క‌మిటీ ప్ర‌క‌టించింది. కాగ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా వ‌న్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version