అశోక యూనివ‌ర్సిటీలో రీసెర్చ్ ఫెలో జాబ్స్‌.. వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. హ‌ర్యాన‌లోని అశోక విశ్వవిద్యాలయానికి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ సోషియ‌ల్ అండ్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంథ్ర‌పి విభాగం రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కనుక ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ప్ర‌స్తుతం ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 మంది రీసెర్చ్ ఫెలో అభ్య‌ర్థుల‌ను రిక్రూట్ చేసుకోనుంది. అయితే దీనిలో సెలెక్ట్ అయినవాళ్లు ఇండియ‌న్ ఫిలాంథ్ర‌పీపై రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది.

jobs
jobs

ఫిలాత్ర‌పీ విభాగానికి సంబంధించి అనుభవం, ఆస‌క్తి ఉన్నవాళ్లే అర్హులు. ఎంపికైన ఉఅభ్య‌ర్థుల‌ ఇండియ‌న్ ఫిలాంథ్ర‌పీపై రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 31, 2021 లోగ అప్లై చెయ్యచ్చు. రీసెర్చ్ కాలం వచ్చేసి 9 నెల‌లు. జీతం రూ.9,00,000 రీసెర్చ్ మొత్తానికి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ రీసెర్చ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సీఎస్ఐపీ రెండు ర‌కాల అభ్య‌ర్థుల‌ను ఎంచుకోనుంది. మొద‌టిది ఇండియాలో లాభాపేక్ష సంస్థ‌లో ప‌ని చేసే వ్య‌క్తులు. ఇలాంటి వారు త‌మ స‌మ‌యంలో సంగం రీసెర్చ్‌కి కేటాయించ‌వ‌చ్చు. త‌మ ప‌నిని ఇద్ద‌రు, ముగ్గురితో పంచుకోవ‌చ్చు.

అలానే వ్యక్తిగత పరిశోధకులు మరియు భారతదేశంలోని లాభాపేక్షలేని సంస్థలతో పనిచేసే వ్యక్తులు, వారు పరిశోధనలో తమ సమయాన్ని సగానికి కేటాయించవచ్చు, దీనిని సంస్థ నుండి మరో ముగ్గురు వ్యక్తులతో పంచుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ప‌రిశోధ‌న పూర్తిగా కంప్యూట‌ర్‌, టాబ్లెట్ లేదా ఫోన్ ద్వారా నిర్వ‌ర్తిస్తారు. రీసెర్చ్‌ఫెలోకి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://csip.ashoka.edu.in/research-fellowship-2022/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news