చార్మినార్, తాజ్‌మహల్ కూడా తానే కట్టేశానని ఓ సెల్పీ తీసుకునేట్టున్నారు : జోగి రమేష్‌

-

నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద చంద్రబాబు సెల్ఫీల పై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లనీ నేనే కట్టేసానని చెప్పుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబూ..? అని జోగి రమేష్‌ మండిపడ్డారు. చంద్రబాబుది మేనిఫెస్టో పార్టీకాదు… సెల్ఫీల పార్టీ అని ఆయన విమర్శించారు. చార్మినార్, తాజ్‌మహల్ కూడా తానే కట్టేశానని ఓ సెల్పీ తీసుకునేట్టున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. తండ్రీ, కొడుకులు సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలు అంటూ ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా.. ‘చంద్రబాబే టిడ్కోఇళ్లన్నీ కట్టేస్తే.. మరి ఈ ప్రభుత్వం వచ్చాక రూ.8734 కోట్లు టిడ్కో ఇళ్ల కోసం ఎందుకు పెట్టినట్టు? అందులో రూ. 5840 కోట్లతో నిర్మాణ పనులు ఎందుకు చేసినట్టు?  అని ఆయన ప్రశ్నించారు.

మౌలిక సదుపాయాలు కోసం రూ.725 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? మీరు వదిలి వెళ్లిపోయిన రూ.3 వేల కోట్లు బకాయిలు ఎవరు తీర్చినట్టు? చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం నెలకు రూ.3 వేలు చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి. మొత్తంగా 7.2 లక్షలు ఆ పేదవాడు భరించాలి అనేది వాస్తవం కాదా?? మా ప్రభుత్వం పేదల పై భారం లేకుండా ఇల్లును ఉచితంగా ఇస్తున్నాం. ప్రజల పై రూ.3,805.4 కోట్ల భారం పడకుండా చూశాం. 365 చ.అ, 430 చ.అ. ఫ్లాట్ల లబ్ధిదారులకు ముందస్తు చెల్లింపుల్లో 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. దీని ద్వారా రూ.482.31 కోట్లు సబ్సిడీని మా ప్రభుత్వం ఇచ్చింది. లబ్ధిదారులకు ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం రూ.1200 కోట్ల వ్యయాన్ని భరించింది. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని సమాధి కట్టే పేదల ఇళ్లు ఇవి.’ అని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version