Flash News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి షాపులు24/7

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. షాపులను 24 గంటలకు తెరుచుకునేందుకు వీలు కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను శుక్రవారం రాత్రి జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. సంబంధించిన అధికారులు దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. 24 గంటల దుకాణాలు తెరిచి ఉంచుకునేందుకు రుసుము చెల్లించాలని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రోజు 24 గంటలకు షాపు తెరిచి ఉంచుకునేందుకు సంవత్సర కాలానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వానికి రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఉత్వర్వుల్లో పేర్కొంది.

అయితే.. లేబర్‌లాకు అనుకూలంగా మాత్రమే… షాపుల్లో ఉద్యోగులకు పని వేళలు ఉండాలని, అంతేకాకుండా .. దుకాణాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు ఉండాలని పేర్కొంది. ఒకవేళ ఎక్స్‌ట్రా టైం పనిచేసే వారికి అందుకు ఎక్కువ జీతాన్ని చెల్లించాలని, అంతేకాకుండా.. షాపుకు సంబంధించిన ప్రతి వివరాలను పొందుపరుచుకోవాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version