హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదం ఇంకా ముదురుతోంది. హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఇటీవలే అజారుద్దీన్… హెచ్ సిఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్. ప్రస్తుతం హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ఉన్నారు.
ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోంది. క్రికెట్ సీజన్ మొదలవుతున్నా గాడినపడని హెచ్ సిఏ వివాదం. అయితే…. హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమించడంపై అజారుద్దీన్ ఇంకా స్పందించలేదు. దీనిపై ఏ విధంగా అజారుద్దీన్ స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా… తన హెచ్ సిఏ సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేయడాన్ని వారం క్రితమే.. తీవ్రంగా వ్యతిరేకించారు అజారుద్దీన్.