అభిమానులు గుండెల్లో నిలిచిపోయిన ఉద‌య్‌కిర‌ణ్‌..

-

ఉద‌య్ కిర‌ణ్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రి స‌పోర్టు లేకుండా ఎదిగి ఓ వెలుగు వెలిగిన హీరో. మ‌రీ ముఖ్యంగా యూత్ గుండెల్లో నిలిచిన స్టార్‌. అలాంటి వ్య‌క్తి ఒకానొక టైమ్‌లో ల‌వ్ స్టోరీ, అలాగే ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అ్ర‌డ‌స్‌గా నిలిచాడు. కాగా అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డ ఈ హీరో జ‌యంగి ఈరోజు. కాబ‌ట్టి ఈ ట్యాలెంటెడ్ హీరో గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.

వాజపేయాజుల ఉదయ్ కిరణ్ 26 జూన్ 1980న జ‌న్మించారు. ఆయ‌న విజయవాడకు చెందిన వివికె మూర్తి, నిర్మల దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఆయ‌న‌కు ఒక అక్క‌, అన్న‌య్య ఉన్నారు. ఆయ‌న చిన్న‌ప్పుడు కె.వి పికెట్ స్కూల్ త‌ర్వాత సికింద్రాబాదులోని వెస్లీ డిగ్రీ కాలేజీల్లో చ‌దువుకున్నారు. అయితే ఉద‌య్ కాలేజీలో చ‌దువుకుంటున్న‌ప్పుడే మోడలింగ్ స్టార్ట్ చేశాడు. ఆయ‌న 1999 లో ఇంగ్లీష్ మూవీ మిస్టీరియస్ గర్ల్ లో ఓ క్యారెక్ట‌ర్ వేసి సినీ రంగ ప్రవేశం చేశాడు. 2000 సంవ‌త్స‌రంలో కిరణ్ తన గురువు స‌మ‌క్షంలోనే తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. చిత్ర‌మ్ మూవీతో హీరోగా మారిన ఉద‌య్ సినీ దర్శకుడు తేజ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ మంచి హిట్ కొట్టింది.

దాని త‌ర్వాత నువ్వూ నేను, మనసంతా నువ్వే లాంటి బంప‌ర్ హిట్లు కొట్టిన ఉద‌య్ ఇక వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. చాలా త‌క్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయ‌న న‌టించిన నువ్వు నేను మూవీకి ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు సంపాదించుకున్నాడు.

ఇక వీటి త‌ర్వాత వ‌రుస‌గా నీ స్నేహం, కలుసుకోవాల‌ని, శ్రీరామ్, ఔన‌న్నా కాదన్నా లాంటి బంప‌ర్ హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికొస్తే ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత‌తో 2003లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ అనుకోని కార‌ణాల వల్ల ఆ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయింది. దీని త‌ర్వాత ఆయ‌న 2012లో విషిత అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. కానీ తెలుగులో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో త‌మిళంలో సొంత నిర్మాణంలో కొన్ని సినిమాలు చేసి తీవ్రంగా న‌ష్ట‌పోయాడు. దాంతో ఏడాది పాటు పూర్తిగా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాడు. ఇక మాన‌సిక వేధ‌న త‌ట్టుకోలేక చిర‌వ‌కు 2014 జ‌న‌వ‌రి 6న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో ఇండ‌స్ట్రీ మొత్తం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news