రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం ఏంటంటే?

-

బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. నటుడు శ్రీకాంత్ కూడా పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా దానికి శ్రీకాంత్ ఏకంగా ఒక వీడియో రికార్డు చేసి తాను తన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానంటూ స్పష్టత ఇచ్చారు.

ఇదిలా ఉండగా జానీ మాస్టర్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కూడా పోలీసులు షూట్ చేసిన వీడియోలో కనిపించాడు. దీంతో అది జానీ మాస్టర్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ నేపద్యంలో జానీ మాస్టర్ స్పందించాడు.నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని.అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది అని ఎక్స్(ట్విట్టర్) లో రిప్లై ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news