జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జానీ మాస్టర్ పరారయ్యారు. గోవాలో ఉన్నట్టు పోలీసులు సాంకేతిక టెక్నాలజీ సాయంతో జానీ మాస్టర్ ఆచూకి ని గుర్తించారు. పెద్ద పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకి తెలిసిపోతుందనే ఉద్దేశతో జానీ మాస్టర్ ఓ చిన్న హోటల్ లో తలదాచుకున్నాడు.
అయితే జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాల గురించి వివరించిన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. 5 రోజుల కస్టడీ కోసం నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొచ్చని అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ ను ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.